చంద్రబాబు స్కీమ్ కావలనింది ఒక్కరే

రూపాయికే ఇల్లు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వమేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. శ్రీకాళహస్తిలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టిడ్కో ఇళ్లను [more]

Update: 2020-12-28 08:28 GMT

రూపాయికే ఇల్లు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వమేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. శ్రీకాళహస్తిలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టిడ్కో ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. ఇందులో లబ్దిదారులు ఇరవై వేలు బ్యాంకులకు రుణం కట్టాలన్నారు. 1,43,000 మంది టిడ్కో లబ్దిదారుల ఆలోచనలు తెలుసుకోవడానికి తాను ఇంటింటికి సర్వే చేయించానని చెప్పారు. వారి అభిప్రాయం ఎలా ఉందంటే కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలని చెప్పారన్నారు. మిగిలిన వారంతా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ కావాలన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 3.805 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. చంద్రబాబు వేయించిన కేసులతో కొన్ని చోట్ల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయలేకపోతున్నామని జగన్ చెప్పారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ని ఆపేందుకు చివర నిమిషం వరకూ కుట్రలు చేస్తూనే ఉన్నారన్నారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే డెమొగ్రాఫ్ ఇన్ బ్యాలెన్స్ వస్తుందని కేసులు వేశారని, ఇది తనకు చాలా బాధ కలిగించిందన్నారు. విశాఖలోనూ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని అడ్డుకున్నారన్నారు. హైకోర్టు నుంచి స్టేలు తెచ్చి అడ్డుకున్నారన్నారు.

Tags:    

Similar News