మూడు రిజర్వాయర్లకు జగన్ భూమి పూజ

అనంతపురం జిల్లాలో రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ నిర్వహించారు. వర్చువల్ పద్ధతిలో ఆయన భూమి పూజ చేశారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం వల్ల హంద్రీనీవా ద్వారా [more]

Update: 2020-12-09 07:40 GMT

అనంతపురం జిల్లాలో రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ నిర్వహించారు. వర్చువల్ పద్ధతిలో ఆయన భూమి పూజ చేశారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం వల్ల హంద్రీనీవా ద్వారా వచ్చే కృష్ణా జలాలను నిల్వ చేసుకునే అవకాశముంది. దీనివల్ల రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందుకు 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. మూడు రిజర్వాయర్లకు జగన్ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. దీనికి డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీ మేరకు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని జగన్ తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని జగన్ వివరించారు

Tags:    

Similar News