వారికి జగన్ టార్గెట్ ఇదే

నీటిపారుదల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ప్రణాళికలను రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై కూడా జగన్ [more]

Update: 2019-09-12 09:52 GMT

నీటిపారుదల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ప్రణాళికలను రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై కూడా జగన్ ఆరా తీశారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగాఉండాలని జగన్ ఈ సందర్భంగా అధికారులతో చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన పనులు,పెండింగ్ పనులను జగన్ అడిగి తెలుసుకున్నారు. వెలుగోడు – కడప కాల్వ పనులు పూర్తి కాలేదని జగన్ కు అధికారులు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపైనా జగన్ సమీక్షించారు. రాయలసీమకు అనుకున్న రీతిలో నీటిని తీసుకెళ్లలేకపోయామని జగన్ కు అధికారులు వివరించారు. ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్నిఅవలంబించాలని కోరారు.గుంటూరు ఛానల్ పొడిగింపు పనుల పురోగతిని కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని జగన్ అధికారులకు టార్గెట్ పెట్టారు.

Tags:    

Similar News