జగన్ కేసుపై అప్పీల్..!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ నిందితుడు శ్రీనివాస్ [more]

Update: 2019-01-18 05:05 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ నిందితుడు శ్రీనివాస్ ను విచారించింది. నిందితుడి నుంచి సేకరించిన ఆధారాలను తమకు అప్పగించాలని ఎన్ఐఏ ఏపీ పోలీసులను కోరుతోంది. కాని చంద్రబాబునాయుడు మాత్రం ఎన్ఐఏకు అప్పగించేందుకు సిద్ధంగా లేరు. దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఎన్ఐఏ కు ఉగ్రవాద సంబంధ కేసులనే అప్పగిస్తారని, చిన్న దాడి కేసును ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్టర్ ప్రభుత్వ అధికారాలను తూట్లు పెడిచేయడమేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రధానికి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. దాని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏపీ పోలీసులు ఈరోజు జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద ఎన్ఐఏ విచారణ ఈ కేసులో సక్రమంగా జరిగే అవకాశం లేదనే అనిపిస్తోంది.

Tags:    

Similar News