పేదల కష్టాలు చూశాను.. పరిష్కరించే అవకాశమివ్వండి

పాదయాత్రలో గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న రైతులను… పిల్లలను చదివించడానికి అప్పులపాలవుతున్న తల్లిదండ్రులను… ఉద్యోగాలు లేక బాధపడుతున్న యువతను… ఆరోగ్యశ్రీ పనిచేయక అవస్థలు పడుతున్న రోగులను చూశానని, [more]

Update: 2019-03-18 10:14 GMT

పాదయాత్రలో గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న రైతులను… పిల్లలను చదివించడానికి అప్పులపాలవుతున్న తల్లిదండ్రులను… ఉద్యోగాలు లేక బాధపడుతున్న యువతను… ఆరోగ్యశ్రీ పనిచేయక అవస్థలు పడుతున్న రోగులను చూశానని, వారి కష్టాలు విన్నానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నివర్గాల కష్టాలను చూశానని, అధికారంలోకి వస్తే అందరి జీవితాల్లోనూ మార్పు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. సోమవారం రాయదుర్గంలో జగన్ ఎన్నికల ప్రచారం సభ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఎన్నికల వేళ చంద్రబాబు పింఛన్ పెంచారని, పసుపు కుంకుమ అని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసాలకు, బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వైసీపీ తీసుకువచ్చే నవరత్నాలతో పేదల జీవితాల్లో సమూల మార్పు వస్తుందని పేర్కొన్నారు. ఇవాళ ధర్మానికి, అధర్మానికి మధ్య… విశ్వసనీయత, వంచనకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. తాము కేవలం టీడీపీతో మాత్రమే యుద్ధం చేయడం లేదని, యేల్లో మీడియాతోనూ యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ 20 రోజులు టీడీపీ, యెల్లో మీడియా అనేక డ్రామాలు చేస్తాయని, ఉన్నవి లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని పేర్కొన్నారు.

Tags:    

Similar News