ఎల్లో మీడియాపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు..!

తెలుగుదేశం పార్టీ అనుబంధ యెల్లో మీడియాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం సత్తెనపల్లిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన [more]

Update: 2019-04-03 06:52 GMT

తెలుగుదేశం పార్టీ అనుబంధ యెల్లో మీడియాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం సత్తెనపల్లిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… ఎంత దుష్ప్రచారం చేసినా జనం నమ్మడం లేదనే భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు ముఖాల్లో కనిపిస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని లోక్ నీతి సర్వే చెప్పినట్లు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ కథనం రాశారని, కానీ ఈ సర్వే తాము చేయలేదని ఛీ కొట్టి రాధాకృష్ణ ముఖంపై సదరు సంస్థ ఉమ్మేసిందన్నారు. అయినా సిగ్గు లేకుండా తుడుచుకొని మళ్లీ అటువంటి కథనాలే రాస్తున్నారని ఆరోపించారు. విశాఖలో గర్భణీ స్త్రీపై వైసీపీ వారు దాడి చేశారని ఆంధ్రజ్యోతి రాసిందని, చంద్రబాబు వారం పాటు చెప్పారని, కానీ ఈ దాడితో వైసీపీకి సంబంధం లేదని స్వయంగా పోలీసులే చెప్పారని గుర్తు చేశారు.

చంద్రబాబు ప్రయోజనాలే జర్నలిజమా..?

అయినా మారకుండా రోజూ ఇలాంటి అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బంగారం కంటే బొగ్గే అందంగా ఉందని, నెమలి కంటే కాకే అందంగా ఉందని యెల్లో మీడియా చెప్పగలదని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమాలపై ఒక్క కథనమైనా యెల్లో మీడియాలో వచ్చిందా అని ప్రశ్నించారు. పైగా వీళ్లు నీతి, నిజాయితీ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. జర్నలిజం అంటే చంద్రబాబు ప్రయోజనమా లేక చంద్రబాబు ద్వారా యెల్లో మీడియాకు కలిగే ప్రయోజనమా అన్నారు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు కూడా దక్కవనే భయంతో రోజుకో దుష్ప్రచారం పుట్టించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News