బాబూ.. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా..?

చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి ఇవాళ ప్రత్యేక హోదా అనే పదం మళ్లీ వచ్చింది అంటే దానికి కారణం తన పోరాటమని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ [more]

Update: 2019-02-11 10:44 GMT

చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి ఇవాళ ప్రత్యేక హోదా అనే పదం మళ్లీ వచ్చింది అంటే దానికి కారణం తన పోరాటమని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలో ఆయన వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ‘సమర శంఖారావం’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… అసెంబ్లీలో ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ మాట్లాడారని, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా అడిగిన వారికి జైళ్లలో వేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలు వచ్చేసరికి యూటర్న్ తీసుకుని ఢిల్లీలో వెళ్లి నల్లచొక్కా వేసుకొని దీక్ష చేస్తున్నాడంటే దానికి కారణం తన పోరాటమన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త పథకాలు తీసుకువస్తున్నారని ఆరోపించారు. జగన్ పథకాలను కాపీ కొట్టడం కూడా సరిగ్గా రాని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News