చంద్రబాబు బయోపిక్ కు పేర్లు చెప్పిన వైసీపీ

ఇప్పటికే తొమ్మిది శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు… వైసీపీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లకు కొన్నారో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత బాలశౌరి డిమాండ్ [more]

Update: 2018-12-31 10:44 GMT

ఇప్పటికే తొమ్మిది శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు… వైసీపీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లకు కొన్నారో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత బాలశౌరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత జగన్ ను జేసీ దివాకర్ రెడ్డి స్టేజిపై తిడుతుంటే ముసిముసి నవ్వులు నవ్విన చంద్రబాబుకు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. జేసీ వ్యాఖ్యలను ఖండించని చంద్రబాబు.. కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా తప్పుపడతారన్నారు. చంద్రబాబు బయోపిక్ తీస్తే ఆ సినిమాకు.. ‘మహానగరంలో మాయగాడు’, ‘యూటర్న్ మోసగాడు’ అనే పేర్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగా పోటీ చేసే సత్తా జగన్ కి ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News