టీడీపీ నేతపై హైకోర్టు

తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీఐడీ హైకోర్టుకు నివేదికను [more]

Update: 2019-08-26 06:17 GMT

తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీఐడీ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ నిర్ణయమని హైకోర్టు అభిప్రాయపడింది. అక్రమ మైనింగ్ జరిగినట్లు ఖచ్చితమైన ఆధారాలు సీఐడీ నివేదికలో ఉన్నాయని హైకోర్టు చెప్పింది. యరపతినేని శ్రీనివాసరావు బ్యాంకు లావాదేవీలు కూడా అనుమానంగానే ఉన్నాయంది. సీబీఐ తో పాటు ఈడీ కూడా దర్యాప్తు జరిపితే బాగుంటుందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News