అప్పుడు వాజ్ పేయి...ఇప్పడు యడ్యూరప్ప...

Update: 2018-05-19 14:17 GMT

1996... లోక్ సభలో పూర్తి మెజారిటీ లేదు. కానీ, బీజేపీ తరుపున అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, 13 రోజులకే ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పార్టీ తరుపున కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప 3 రోజులకే ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. సందర్భాలు వేర్వేరైనా ఇద్దరూ ఎదుర్కొన్న పరిస్థితి మాత్రం ఒక్కటే. విశ్వాస పరీక్షకు ముందే వారు ఉద్వేగపూరిత ప్రసంగం చేసి పదవి నుంచి వైదొలిగారు. ఇవాళ యడ్యూరప్ప చేసిన భావోద్వేగం చూసిన వారికి ఆరోజు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమైన వాజ్ పేయ్ ప్రసంగం గుర్తుకు వచ్చింది. విశ్వాస పరీక్షకు ముందు వాజ్ పేయ్ కూడా ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. విశ్వాస పరీక్షపై చర్చలో లోక్ సభలో వాజ్ పేయ్ భావోద్వేగంతో మాట్లాడిన అనంతరం రాష్ట్రపతికి రాజీనామా సమర్పించారు. ఇప్పడు యడ్యూరప్ప కూడా అదేవిధంగా సభ నుంచి గవర్నర్ వద్ద కు వెళ్లి రాజీనామా అందజేశారు.

Similar News