యడ్యూరప్ప రాజీనామా చేస్తారా...?

Update: 2018-05-19 09:46 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. బలపరీక్షకు సమయం దగ్గరపడుతున్నా కావాల్సినంత మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకోలేకపోయారని వినిపిస్తోంది. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ అన్ని రకాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదా..అంటే అవుననే సమాధానం వస్తోంది. దీంతో ఇక చేసేదేమీ లేక రాజీనామా చేసేందుకు యడ్యూరప్ప సిద్ధపడ్డారని పలువు జాతీయ, కన్నడ ఛానెళ్లలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన 13 పేజీల రాజీనామా లేఖ కూడా సిద్ధం చేసుకున్నారని, బలపరీక్షకు ముందే అసెంబ్లీలో ప్రసంగించిన అనంతరం గవర్నర్ ను కలిసి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పార్టీకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు తేవద్దని సూచనలు చేయడం కూడా ఇందుకు కారణమని అంటున్నారు. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా యడ్యూరప్పకు ఫోన్ చేసి ధైర్యంగా బలపరీక్షను ఎదుర్కోమని, ప్రశాంతంగా ఉండండని సూచించారనికూడా పలు కన్నడ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి.

Similar News