వివేకాను హత్య చేసింది వారేనా…?

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పులివెందుల సీఐ శంకరయ్యను జిల్లా ఎస్సీ రాహుల్ దేవ్ శర్మ సస్పెండ్ చేశారు. సంఘటన జరిగిన రోజు అక్కడ [more]

Update: 2019-03-22 03:45 GMT

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పులివెందుల సీఐ శంకరయ్యను జిల్లా ఎస్సీ రాహుల్ దేవ్ శర్మ సస్పెండ్ చేశారు. సంఘటన జరిగిన రోజు అక్కడ రక్తపు మరకలను తుడిచివేయడం, సాక్ష్యాలను రూపుమాపాలని ప్రయత్నించడం వంటి ఘటనలు సీఐ సస్పెన్షన్ కు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఈ హత్యపై విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. కిరాయి హంతకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని సిట్ విచారణలో దాదాపుగా తేలింది. ఆర్థిక లావాదేవీలే కారణమని సిట్ ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. ఒక వారం రోజుల్లో వివేకా హత్య కేసు మిస్టరీ వీడనుంది. వివేకానందరెడ్డి అనుచరులు ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని ప్రధాన నిందితులని భావిస్తున్నారు.

Tags:    

Similar News