షర్మిల పార్టీ ప్రభావం ఏమీ ఉండదు

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వైఎస్ షర్మిల ఎక్కడున్నారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణలో సమస్యపై స్పందించడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. తెలంగాణలో రాయలసీమ [more]

Update: 2021-04-11 01:32 GMT

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వైఎస్ షర్మిల ఎక్కడున్నారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణలో సమస్యపై స్పందించడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. తెలంగాణలో రాయలసీమ రాజ్యం కావాలని కోరుకుంటున్నారా? అని వి.హనుమంతరావు ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లు కూడా కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన నేతలేనన్న విషయాన్ని షర్మిల గుర్తుంచుకోవాలని వి.హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ నేతలకు షర్మిల ఎందుకు ఫోన్లు చేస్తున్నారని వి.హనుమంతరావు ప్రథ్నంచారు. షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండబోదన్నారు.

Tags:    

Similar News