ప్రభుత్వం అప్పుడూ.. ఇప్పుడూ పట్టించుకోలేదు

తెలంగాణ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేకుండానే నెట్టుకువస్తున్నారని [more]

Update: 2021-05-15 00:41 GMT

తెలంగాణ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేకుండానే నెట్టుకువస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత లాక్ డౌన్ సమయంలోనే ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచాలని సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన చెందారు. కేసీఆర్ కరోనా కట్టడిని మానేసి రాజకీయ కక్షలను తీర్చుకోవడానికే సమయం వెచ్చిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కరోనా వచ్చి ఏడాది అయినా ఇప్పటికీ టెస్టింగ్ కిట్స్ లేకపోవడం మన దుస్థితి అని ఆయన చెప్పారు.

Tags:    

Similar News