ఉలిక్కిపడ్డ కాంగ్రెస్... స్వామిగౌడ్ ని కలిసి ఉత్తమ్

Update: 2018-12-21 06:20 GMT

శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు నలుగురు ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కి లేఖ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే హుటాహుటిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసనమండలి నేత షబ్బీర్ అలీ స్వామిగౌడ్ ని కలిశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినందున విలీనానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. కాంగ్రెస్ లో లేని ఎమ్మెల్సీలు సీఎల్పీ మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. 2016లో పార్టీ మారిన ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వ్యవస్థలను ఈ విధంగా నాశనం చేయడం మంచిది కాదని, శాసనమండలి ప్రతిష్ఠతను కాపాడాలని కోరారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు.

Similar News