నెగ్గిన ట్రంప్ పై అభిశంసన తీర్మానం

అమెరికా అధ్కక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ [more]

Update: 2021-01-14 02:28 GMT

అమెరికా అధ్కక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ ముట్టడికి డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించారని ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా చరిత్రలో రెండోసారి గురైన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. ట్రంప్ పై అభిశంసతన తీర్మానానికి అనుకూలంగా 234 ఓట్లు రాగా వ్యతిరేకంగా 197 ఓట్లు లభించాయి. ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ పై విచారణ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News