రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధం…??

టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రవి ప్రకాష్ తో పాటు హీరో శివాజీ లకు 41 సీఆర్పీసీ నోటీసులు [more]

Update: 2019-05-14 01:46 GMT

టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రవి ప్రకాష్ తో పాటు హీరో శివాజీ లకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండుసార్లు 160 సెక్సన్లకింద హాజరు కావాలంటూ రవిప్రకాష్ కు నోటీసు ఇచ్చారు. అయినా కూడా రవి ప్రకాష్ హాజరుకాలేదు. దీంతో 41సీఆర్పీసీ కింద ప్రకాష్ కి అరెస్టు నోటీసులు జారీ చేశారు ..ఈ నెల 15వ తేదీ పోలీసుల ఎదుట హాజరై తన వాదనను వినిపించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు .ఇప్పటికే ప్రకాష్ రవి ప్రకాష్ తో పాటుగా శివాజీ పైన రెండు ఎఫ్ఐఆర్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. వీటిపైన పోలీసు అధికారులు విచారణ ఆరంభించారు. విచారణ ప్రారంభించిన నాటి నుంచి రవిప్రకాష్, శివాజీలు పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు .. గతంలో 160 సీఆర్పీసీ నోటీసు కింద హాజరై తమ వాదనను వినిపించుకోవాలని పోలీసులు అవకాశమిచ్చారు. అయినా రవి ప్రకాష్, హీరో శివాజీ ఇద్దరు కూడా పోలీసులు ఎదుట హాజరుకాలేదు. ఇద్దరికీ 41 సీఆర్పీసీ కింద అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన హాజరై తమ వాదనలు ఇద్దరు చెప్పుకోవాల్సి ఉంటుంది. హాజరు కాని పక్షంలో తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News