పీవీ సింధుకి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2018-07-13 07:48 GMT

రియో ఒలంపిక్స్ లో రజత పతాకం సాధించిన బ్యడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒలంపిక్స్ లో విజయం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆమెకు భారీగా నజరానాలు ప్రకటించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని భరణి నగర్ లో 1000 గజాల స్థానాన్ని, రూ.5 కోట్ల నగదు బహుమతిని ఆమెకు అందించింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమెకు అమరావతిలో ప్రభుత్వ స్థలం, నగదు, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కేటాయించింది.

ఇంకా స్థలం కావాలి

అయితే, తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన వెయ్యి గజాల స్థలం పక్కనే 400 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా తనకు కేటాయించాలని సింధు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందిన సింధుకు ఇంకా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరకే సింధు దరఖాస్తును పక్కన పెట్టినట్లు తెలిస్తోంది.

Similar News