నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకు..?

చంద్రబాబు నాయుడు నేరం చేయకపోతే ఇంత ఉలికిపాటుకు ఎందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వాహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు [more]

Update: 2019-03-05 06:18 GMT

చంద్రబాబు నాయుడు నేరం చేయకపోతే ఇంత ఉలికిపాటుకు ఎందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వాహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, కోర్టులో తప్పుడు పిటీషన్లు ఎందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే భయపడుతున్నారని ఆరోపించారు. కోర్టుల్లో తప్పుడు పిటీషన్లు వేయడం బట్టీ చంద్రబాబు నాయుడు పరోక్షంగా కోట్లాది మంది వ్యక్తిగత వివరాలను ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు ఒప్పుకుంటున్నారని అన్నారు. ఈ విషయంపై ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పలన్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమేనని, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై ఏడుపులు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News