మూడు రాజధానులపై నేడు సుప్రీంకోర్టులో

మూడు రాజధానుల బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడురాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం [more]

Update: 2020-08-26 02:11 GMT

మూడు రాజధానుల బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడురాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పాలన వికేంద్రీకరణకు అనువుగా స్టే ఎత్తి వేయాలని సుప్రీంకోర్టును ఏపీ సర్కార్ అభ్యర్థించింది. దీనిపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాషణ్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం నేడు దీనిపై విచారణ జరపనుంది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News