30వ తేదీ వరకూ లాక్ డౌన్ లాంటిదే.. కానీ కాదు

నేటి నుంచి మహారాష్ట్రలో కొత్త ఆంక్షలను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్దమయింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెల 30వ తేదీ వరకూ [more]

Update: 2021-04-14 01:36 GMT

నేటి నుంచి మహారాష్ట్రలో కొత్త ఆంక్షలను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్దమయింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెల 30వ తేదీ వరకూ జనతా కర్ఫ్యూ ను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో ఉద్దవ్ థాక్రే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రోజులకు యాభై వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా సహకరించాలని ప్రభుత్వం కోరింది. నేటి రాత్రి నుంచి మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిది. అయితే పూర్తి స్థాయి లాక్ డౌన్ మాత్రం ఉండదు. కేవలం పదిహేను రోజుల పాటు ఆంక్షలు మాత్రం అమలులో ఉంటాయి. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ఉద్ధవ్ థాక్రే కోరారు.

Tags:    

Similar News