శ్రీలంకపై మొదటి వికెట్ తీసిన టెండుల్కర్

Update: 2018-07-17 13:09 GMT

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ వారసుడిగా క్రికెట్ లోకి ప్రవేశించిన అర్జున్ టెండుల్కర్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు భారత్ అండర్-19 జట్టుకు అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. సిరీస్ లో భాగంగా మంగళవారం ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి దిగింది. దీంతో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండుల్కర్ మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. అర్జున్ వేసిన రెండో ఓవర్ లోనే శ్రీలంకన్ బ్యాట్స్ మెన్ కపిల్ మిశ్రా వికెట్ తీశాడు. అంతర్జాతీయ కెరీర్ లో అర్జున్ ఖాతాలో మొదటి వికెట్ పడింది. మొత్తం 11 ఓవర్లు వేసిన అర్జున్ 33 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు.

సచిన్ బాల్య స్నేహితుడి బావోద్వేగం

అర్జున్ టెండుల్కర్ తొలి అంతర్జాతీయ వికెట్ తీయడంతో సచిన్ టెండుల్కర్ బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘అర్జున్ వికెట్ తీయడం చూసి ఆనందబాష్పాలు వస్తున్నాయి. అతడు ఎదగడం, ఆట కోసం కష్టపడటం కనిపిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అర్జున్.. ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి. మొదటి వికెట్ ను ఆస్వాధించు’’ అని పేర్కొన్నారు.

Similar News