నేడు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పోలీసు శాఖ సర్వం సిధ్దమైంది. 50 వేల మంది పోలీస్ సిబ్బంది తో భద్రత ఏర్పాటు చేశామని,నక్సల్స్ [more]

Update: 2020-01-22 01:51 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పోలీసు శాఖ సర్వం సిధ్దమైంది. 50 వేల మంది పోలీస్ సిబ్బంది తో భద్రత ఏర్పాటు చేశామని,నక్సల్స్ ప్రభావిత జిల్లాలలతో పాటు సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టింది తెలంగాణ పోలీస్ శాఖ. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా ప్రశాంతంగా జరిగాయో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసమన్నారు ఎన్నికల నోడల్ అధికారి లా అండ్ ఆర్డర్ డీజీ జితేందర్. 120 మున్సిపాలిటీలకు, 10 కార్పోరేషన్ లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ జరుపుతారన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటుచేసు కోకుండా జిల్లా పోలీస్ ఉన్నాధికారులతో ఎప్పటి కప్పుడు సమాచారం తెలిపేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ బందోబస్తులో తెలంగాణ పోలీసు ఫోర్స్ తో పాటు టీఎస్ ఎస్పీ బెటాలియన్స్, ఆర్మ్ రిజర్వ్డ్ ఎక్పైజ్ శాఖ,ఫారెస్ట్ డిపార్టమెంట్,హోంగార్డ్స్, టాస్క్ ఫోర్స్ ,స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.ఐబి , ఎసిబి ఎన్ ఫోర్స్ మెంట్,విజిలెన్స్, ట్రాన్సకో, విభాగాలకు చెందిన వారితో కూడా భద్రత నిర్వహిస్తున్నామని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డిజి జితేందర్ తెలిపారు.

Tags:    

Similar News