కరోనాపై హైకోర్టు సూచనలివే

కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగింది. జన సమూహాన్ని తగ్గించడం కోసం ప్రతి కాలనీలో [more]

Update: 2020-04-21 12:32 GMT

కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగింది. జన సమూహాన్ని తగ్గించడం కోసం ప్రతి కాలనీలో మొబైల్ రైతుబజారు ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో కరోనా కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో కొవిడ్ నివారణకు సరై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదప్రతివాదాలు విన్న తర్వాత కరోనా వైద్యం చేస్తున్న వైద్యులకు మాస్కులు, పీపీఈ కిట్లు తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పై తీసుకున్న చర్యలపై మరోసారి పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తదుపరి విచారణకు మే 8వ తారీకు వాయిదా వేసింది.

Tags:    

Similar News