లాక్ డౌన్ మినహాయింపు సమయంలో జాగ్రత్త

లాక్ డౌన్ మినహాయింపు సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన [more]

Update: 2021-05-14 01:12 GMT

లాక్ డౌన్ మినహాయింపు సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మే 31వ తేదీలో పు రెండో డోస్ వారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే తొలి విడత డోస్ ఇస్తామని చెప్పి శ్రీనివాసరావు చెప్పారు. గత ఏడాది 236 ఆసుపత్రులు కరోనా సేవలు అందించడానికి ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1200 కు పెరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల గురించి ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుందని శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News