తెలంగాణలో ఆంక్షలను పెంచిన ప్రభుత్వం.. మాస్క్ తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ వరకూ ఎలాంటి సామూహిక కార్యక్రమాలను నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీలు, యాత్రలపై తెలంగాణ ప్రభుత్వం [more]

Update: 2021-03-28 01:17 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ వరకూ ఎలాంటి సామూహిక కార్యక్రమాలను నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీలు, యాత్రలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోలీ, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, గుడ్ ఫ్రైడే వంటి పండగలపై ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలని ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News