ఆ రెండు వార్తలపై ప్రభుత్వం సీరియస్

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నా ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రెండు వార్తలపై కేసులు నమోదు చేయించింది. [more]

Update: 2020-03-30 13:55 GMT

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నా ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రెండు వార్తలపై కేసులు నమోదు చేయించింది. తెలంగాణకు ఆర్మీ వచ్చిందoటూ ప్రచారం చేసిన వారిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. మరోవైపు హైదరాబాదులో కరోనా ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించినట్టుగా వచ్చిన వార్తలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు వార్తలు సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోలీసు శాఖను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వార్తల పైన కేసు నమోదు చేశారు. తెలంగాణకు ఆర్మీ వచ్చిందంటూ చేసిన ప్రచారం తో పాటుగా తెలంగాణలో కరోనా ఉన్న నేపథ్యంలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారని పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది . ఈ వార్తలను ముందుగా ఎవరు తయారు చేశారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు . ఎక్కడి నుంచి వార్తలు తయారుచేసి సోషల్ మీడియా కు పంపించారు. వాట్స్ అప్ తో పాటుగా ఫేస్ బుక్ సంస్థల నుంచి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు . దీని ఆధారంగా ఈ రెండు వార్తలు పోస్ట్ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News