హైకోర్టు ప్రతిపాదనకు నో

హైకోర్టు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని నియమిస్తామని హైకోర్టు స్పష్టం చేసిన [more]

Update: 2019-11-13 07:54 GMT

హైకోర్టు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని నియమిస్తామని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా లేదు. ఆర్టీసీ కేసులన్నింటినీ లేబర్ కమిషనర్ కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఆర్టీసీ సమ్మె ఒక కొలిక్కి తీసుకురావాలన్న హైకోర్టు ప్రయత్నానికి ప్రభుత్వం అంగీకరించలేదని తెలిసింది. లేబర్ కమిషనర్ కే అప్పగించాలని ప్రభుత్వం అఫడవిట్ ప్రభుత్వం దాఖలు చేయనుంది. హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల వివాదం మరింత ముదురుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.

Tags:    

Similar News