వారణాసిలో తెలంగాణ రైతులకు తిప్పలు

తమ సమస్యను వారణాసిలో నరేంద్ర మోడీపై పోటీ చేయడం ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజామాబాద్ లో పసుపు బోర్డును [more]

Update: 2019-04-27 07:47 GMT

తమ సమస్యను వారణాసిలో నరేంద్ర మోడీపై పోటీ చేయడం ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజామాబాద్ లో పసుపు బోర్డును స్థాపించాలనే డిమాండ్ తో నరేంద్ర మోడీపై పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఇందుకోసం 50 మంది రైతులు వారణాసికి బయలుదేరి వెళ్లారు. వారణాసి వెళ్లేందుకు మొదట వారు రైలు బోగీ బుక్ చేసుకున్నా చివరి నిమిషంలో అధికారులు రద్దు చేశారు. దీంతో బస్సు ఏర్పాటు చేసుకొని వెళ్లారు. వారికి అక్కడకు వెళ్లాక నామినేషన్ కు మద్దతుగా సంతకం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు కొందరు ముందుకొచ్చినా స్థానిక బీజేపీ నేతల ఒత్తిడి వెల్ల వారు వెనక్కు తగ్గుతున్నారు. దీంతో ప్రపోజల్స్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులు సైతం రైతులను ఇక్కడకు ఎందుకు వచ్చారని పదేపదే ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది. ఇక, తమిళనాడు నుంచి 50 మంది రైతులు వారణాసికి వెళ్లాల్సి ఉన్నా ఆరుగురు రైతు నేతలను పోలీసులు పాత కేసులపై అరెస్ట్ చేయడంతో వారు ఆలస్యంగా బయలుదేరుతున్నారు. అయితే, ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్లు వేస్తామని రైతులు చెబుతున్నారు.

Tags:    

Similar News