తెలంగాణాను నాకొదిలేయండి....!

Update: 2018-12-05 10:03 GMT

మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే... నాలుగేళ్లలో కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఏఐసీసీ రాహుల్ గాంధీ విమర్శించారు. బుధవారం కోదాడ ప్రజాకూటమి బహిరంగ సభకు ఆయన హాజరయ్యరు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబం మినరల్ వాటర్ తాగుతుంటే నల్లగొండ ప్రజలు మాత్రం ప్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలందరికీ శుద్ధమైన తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై రెండున్నర లక్షల అప్పులబారాన్ని ప్రభుత్వం వేసిందని... అదే సమయంలో కేటీఆర్ ఆస్తులు మాత్రం 400 శాతం పెరిగాయన్నారు.

‘మేడ్ ఇన్ తెలంగాణ’ అని కనిపించాలి...

తెలంగాణ ప్రజలను దోచిందంటా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లు కాంట్రాక్టర్ల కోసమే కేసీఆర్ పాలన సాగిందని... యువత, రైతులకు ఏమీ చేయలేదన్నారు. లక్షల మంది డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లేయాలని... ప్రజాకూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం రానుందన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తమకు చాలా కలలు ఉన్నాయని... ‘మేడ్ ఇన్ తెలంగాణ’ అని రాసి ఉన్న వస్తువులు ప్రపంచం మొత్తం కనిపించాలనే ఆశ తమకు ఉందని, ఆ విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా ఢిల్లీలో రాహుల్ గాంధీ అనే సిఫాయి ఉన్నాడని గుర్తుంచుకోవాలని కోరారు.

Similar News