కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలకాంశాలు

Update: 2018-11-27 14:02 GMT

సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. 37 అంశాలతో తయారుచేసిన మేనిఫెస్టోను గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నేతలు కుంతియా, జైరామ్ రమేశ్ విడుదల చేశారు. తమది ప్రజల మేనిఫెస్టో అని, ప్రతి ఏడాది మేనిఫెస్టో అమలుపై ప్రజలకు వివరణ ఇస్తామని తెలిపారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

- ఏకకాలం రూ. 2లక్షల రైతు రుణమాఫీ

- వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు పింఛన్ రూ.2 వేలకు పెంపు

- స్వంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సహాయం

- అమరవీరుల కుటుంబాలకు సామాజిక భద్రత

- పంటలకు మద్దతు ధర పెంపునకు హామీ

- ఉద్యోగాల భర్తీకి ప్రతీయేటా క్యాలెండర్

- నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి

- మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ

- పంటల ధరల స్థిరీకరణకు రూ.5 వేల కోట్ల నిధి

- కూలీ, కౌలు రైతులకు సహాయం

- వ్యవసాయ శాఖను రైతు సంక్షేమ అభివృద్ధి శాఖగా పేరు మార్పు

- 17 పంటలకు మద్దతు ధర

- తొలి ఏడాదిలోనే 20 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ

- ఆరోగ్య శ్రీ పథకంలో అన్నిరకాల జబ్బులకు రూ. 5 లక్షల వైద్యసాయం

- ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, ప్రతీ నియోజకవర్గంలో 500 పడకల ఆసుపత్రి

- ఉస్మానియా ఆసుపత్రి పక్కనే మోడల్ ఆసుపత్రి నిర్మాణం

Similar News