తిరుపతిలో టీసీఎల్..!

Update: 2018-12-20 06:44 GMT

తిరుపతిలో టీసీఎల్ సంస్థకు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ సమీపంలోని 158 ఎకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. రూ.2,200 కోట్ల పెట్టుబడిని ఈ సంస్థ పెట్టనుంది. 2019 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమయ్యే లక్ష్యంతో పనులు జరగనున్నాయి. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షం, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు సంస్థ ప్రకటించింది. టీసీఎల్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టీవీ ప్యానెల్స్ తయారీ పరిశ్రమ అని ప్రకటించారు. టీసీఎల్ ఛైర్మన్ లీ డాంగ్ షెన్గ్ తో కలిసి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, అమర్ నాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Similar News