చిన్న లాజిక్ పట్టుకున్న పరిపూర్ణానంద స్వామి

Update: 2018-07-12 08:25 GMT

గతేడాది జరిగిన ఓ సభలో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై ఆరునెలల పాటు నగర బహిష్కరణ వేటు వేశారు. ఉప్పల్ నుంచి యాదగిరి గుట్ట వరకు జరగాల్సిన ఆయన పాదయాత్రకు అనుమతులు రద్దు చేసి రెండు రోజుల పాటు గృహనిర్భందంలో ఉంచిన పోలీసులు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, పరిపూర్ణానందను స్వయంగా కాకినాడ వరకు తీసుకువెళ్లి అక్కడ దింపి వచ్చారు నగర పోలీసులు.

హుటాహుటిన బయలుదేరిన పోలీసులు

అయితే, ఇక్కడ ఉన్న ఓ చిన్న లాజిక్ ను స్వామి పట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. స్వామిపై విధించింది హైదరాబాద్ బహిష్కరణ కావడంతో ఆయన సైబరాబాద్ లేదా రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉండాలని భావించారు. కాకినాడ నుంచి బయలుదేరేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ బహిష్కరణ విధించారు. ఈ నోటీసులు పట్టుకుని పోలీసులు కాకినాడ బయలుదేరి వెళ్లారు.

Similar News