సుష్మా దెబ్బకు అధికారి బదిలీ

Update: 2018-06-21 08:17 GMT

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో తక్షణమే స్పందిస్తుంటారు. తన, మన లేకుండా న్యాయం అనిపించిన కేసుల్లో సుష్మ అనేక సమస్యలను పరిష్కరించారు. దేశ, విదేశాల నుంచి సుష్మాకు ఈవిషయంలో ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటనలో కూడా సుష్మా వెంటనే స్పందించి ఆ ఘటనకు కారణమైన అధికారిని బదిలీ చేయించారు. వివరాల్లోకి వెళితే నోయిడాకు చెందిన తన్వి సేత్ ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. అయితే ఇద్దరూ పాస్ పోర్టు తీసుకోవడానికి లక్నోలోని పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు.

తన్వీ ట్వీట్ కు.....

కాని అక్కడ పాస్ పోర్ట్ అధికారి ఇద్దరూ వేరే మతానికి చెందిన వారుగా గుర్తించి పాస్ పోర్టు ఇవ్వడానికి తొలుత నిరాకరించారు. పేరు గాని, మతం మార్చుకోవాలని వత్తిడి తెచ్చారు. వేరే మతస్థుడిని పెళ్లి చేసుకున్నందుకు తన్విసేత్ ను అవమానకరంగా మాట్లాడారు. ఇద్దరి పాస్ పోర్ట్ లను హోల్డ్ లో పెట్టారు. దీంతో తన్విసేత్ విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్ సాయాన్ని కోరారు. జరిగిన సంఘటను ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి వెంటనే స్పందించిన సుష్మాస్వరాజ్ వారిద్దరి పాస్ పోర్టులను పరిశీలించేందుకు వేరే అధికారికి అప్పజెప్పారు. పాస్ పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిన అధికారిని బదిలీ చేశారు.

Similar News