బ్రేకింగ్ : రాజకీయ నేతలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Update: 2018-09-25 06:05 GMT

నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయడంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులుంటే అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్లమెంటు కఠిన చట్టాలు తీసుకురావాలని సూచించింది. రాజకీయ అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని వ్యాఖ్యానించిది. అన్ని జాతీయ పార్టీలు వారి నేత నేరచరిత్రను ప్రకటించాలని స్పష్టం చేసింది. రాజకీయాల్లో నేరచరితులు ఉండటం ఒక ఆస్తిగా భావిస్తున్నారని వ్యాఖ్యానించింది. దేశంలో ఎన్నికలను డబ్బు, మదబలం శాసిస్తున్నాయని, ఈ పరిస్థితి మారాలని కోర్టు పేర్కొంది.

Similar News