మధ్యప్రదేశ్ పరిణామాలపై నేడు సుప్రీంకోర్టులో?

మధ్యప్రదేశ్ రాజకీయాలపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. నిన్ననే సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు, స్పీకర్ ప్రజాపతికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలసిందే. మధ్యప్రదేశ్ [more]

Update: 2020-03-18 04:05 GMT

మధ్యప్రదేశ్ రాజకీయాలపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. నిన్ననే సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు, స్పీకర్ ప్రజాపతికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలసిందే. మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వం మెజారిటీని కోల్పోవడంతో బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గవర్నర్ లాల్జీ టాండన్ పన్నెండు గంటలలోగా బలపరీక్ష చేయాలని ఇచ్చిన ఆదేశాలు సయితం అమలు కాలేదు. ఈరోజు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సుప్రీంకోర్టు బలపరీక్షకు గడువు విధించే అవకాశముందంటున్నారు. కాగా అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా బెంగుళూరులోనే ఉన్నారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News