తెలంగాణలో లాక్ డౌన్ విధించాలంటూ?

తెలంగాణలో కరోనా నానాటికీ విస్తరిస్తోందని, కరోనాను కట్టడి చేయాలని సంపూర్ణ లాక్ డౌన్ ఒకటే మార్గమని సామాజికవేత్త సునీతా కృష్ణన్ అంటున్నారు . ఇందుకు సంబంధించి సంపూర్ణ [more]

Update: 2020-06-09 12:41 GMT

తెలంగాణలో కరోనా నానాటికీ విస్తరిస్తోందని, కరోనాను కట్టడి చేయాలని సంపూర్ణ లాక్ డౌన్ ఒకటే మార్గమని సామాజికవేత్త సునీతా కృష్ణన్ అంటున్నారు . ఇందుకు సంబంధించి సంపూర్ణ లాక్ డౌన్.పై ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు . సునీత వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఇది విధానపరమైన నిర్ణయం అని ,దీనిని తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. జూలై 15 వరకు లాక్ డౌన్ విధించాలని సునీత కృష్ణన్ హైకోర్టును కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు వస్తున్నాయని, కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో ఒకటే మార్గమని సామాజికవేత్త సునీత కృష్ణ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలు ఎవరు ఎక్కడికి వెళ్లాలి అనే దానిపైన సొంత నిర్ణయం ఉంటుందని, దానిని తాము కట్టడి చేయలేమని పేర్కొంది. కరోనా పరిస్థితుల్లో ప్రార్థన మందిరాలకు వెళ్లాలా? వద్దా? అనేది ప్రజల ఇష్టమన్న హైకోర్టు తేల్చిచెప్పింది.

Tags:    

Similar News