సుజనాకు చుక్కెదురు….!!

సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ ఎదుట హాజరయ్యేందుకు మినహాయించాలని హైకోర్టులో సుజనా చౌదరి పిటిషన్ దాఖలు చేశారు .ఈ విషయంపై వాద, ప్రతివాదనలు విన్న తర్వాత [more]

Update: 2019-05-01 01:50 GMT

సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ ఎదుట హాజరయ్యేందుకు మినహాయించాలని హైకోర్టులో సుజనా చౌదరి పిటిషన్ దాఖలు చేశారు .ఈ విషయంపై వాద, ప్రతివాదనలు విన్న తర్వాత హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చౌదరి తప్పనిసరిగా సిబిఐ ఎదుట హాజరై తన వాదనలు చెప్పుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా 27, 28 తేదీల్లో తప్పనిసరిగా సిబిఐ ఎదుట హాజరై నోటీసులకు సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది ..అయితే సుజనా చౌదరి అరెస్టు చేయవద్దంటూ సిబిఐ కి హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 27వ తేదీన బెంగళూరు లోని సిబిఐ ఎదుట సుజనా చౌదరి హాజరుకావాల్సి ఉంది .. బెంగళూరు వెళ్ళినప్పటికి సుజనా చౌదరి సిబిఐ ఎదుట హాజరు కాలేదు .తన హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సిబిఐ బెంగళూరు బ్రాంచ్ లో సుజనా చౌదరి మీద కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో సుజనా చౌదరితో పాటు సీబీఐ మాజీ చీఫ్ కుమారుడైన కూడా కేసు నమోదైంది..

Tags:    

Similar News