బ్యాంకులకు కుచ్చు టోపీ , ఫెరారీ లో సవారీ

Update: 2018-11-25 03:19 GMT

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేసి కొనుగోలు చేసిన ఆరు లగ్జరీకార్లను సయితం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సీజ్ చేశారు. షెల్ కంపెనీల పేర్ల మీదనే ఈ లగ్జరీకార్లను సుజనా చౌదరి కొనుగోలు చేసినట్లు ఈడీ విచారణలో తేలింది.ఆడీ, ఫెరారీ, బెంజ్, రేంజ్ రోవర్ వంటి అతిఖరీదైన కార్లను షెల్ కంపెనీ పేర్లమీదనే కొనుగోలు చేశారు. మొత్తం 120 షెల్ కంపెనీలను పెట్టి వాటి ద్వారా దాదాపు బ్యాంకులకు 5,700 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి నట్లు ఈడీ విచారణలో స్పష్టమయింది.

ఫెమా నిబంధనల ఉల్లంఘనకూ....

హైదరాబాద్ లో ఏడు చోట్ల, ఢిల్లీలో ఒక చోట ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ అధికారులు సుజనా చౌదరికి నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Similar News