శ్రీ చైతన్య....స్కామ్ లో నెంబర్ వన్...?

Update: 2018-07-10 03:51 GMT

తెలంగాణ ఎంసెట్ స్కామ్ లో అరెస్టు ల పర్వం కొనసాగుతుంది. ఈ స్కామ్ కు ఇప్పటికే కార్పొరెట్ మకిలి అంటుకుంది. ఇది ఇప్పడు ఎక్కడ వరకు వెళ్లుతుందో తెలియని పరిస్దితి. ఎందుకంటే ఇప్పడు అరెస్టు అవుతున్న వారంతా కార్పొరెట్ కాలేజీలకు చెందిన వారే వుంటున్నారు. మూడు రోజుల క్రితం శ్రీచైతన్య విద్యాసంస్దల డీన్ ను సీఐడి పోలీసులు అరెస్టు చేసి కటాకటాల వెనక్కి నెట్టారు. ఈ డీన్ చరిత్ర పైన పోలీసులు విచారణ చేస్తున్న తరుణంలో మరొక విద్యార్ది బాగోతం వెలుగు చూసింది. శ్రీచైతన్య విద్యాసంస్దలో చదువుకున్న గణేష్ ప్రసాద్ అనే వైద్య విద్యార్దిని సీఐడి అరెస్టు చేసింది. ఈ విద్యార్దినే ఎంసెట్ పేపర్ లీక్ లో కీలకంగా వ్యవహారించడమే కాకుండా తన ద్వారా మరికొంత మంది బ్రోకర్లులను తయారీ చేసి పేపర్ ను అమ్మి సొమ్ము చేసుకున్న తీరు ఇది.

పూర్వ విద్యార్థి......

విజయవాడకు చెందిన గణేష ప్రసాద్ ను సీఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఇతను బెంగుళూర్ లో జరిగిన ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు ధనుంజయ్ ఏర్పాటు చేసిన క్యాంపుకు ముగ్గురు విద్యార్దులను తీసుకుని పొయిన ప్రాకీస్ట్ చేయించాడు. ఈ ముగ్గురు విద్యార్దులు కూడా శ్రీ చైతన్య విద్యాసంస్దలకు చెందిన వారేనని సీఐడి పోలీసుల గణేష్ చెప్పాడు. ఇప్పడు శ్రీచైతన్య విద్యాసంస్దలకు మెడకు ఉచ్చు బిగుసుకుంటుందని సీఐడి వర్గాల చెబుతున్నాయి. ఇప్పటి వరకు 90 మందిని సీఐడి అరెస్టు చేసింది. ఇందులో ముప్పే మందికి పైగా వైద్యా విద్యార్దులు వుండగా. మిగత వారంతా కూడా బ్రోకర్లు. పేపర్ ను బయటికి తెచ్చి అమ్ముకున్న నిందితులు వున్నారని తెలింది. మరొక పది మంది పరారీలో వున్నారని పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసినట్లయితే సెంచరీకి చేరుకుంటుందని పోలీసులు చెప్పారు. పరారీలో వున్న వారిని పట్టుకునేందుకు సీఐడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Similar News