వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. లాక్ డౌన్ ఎత్తివేస్తే?

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. ఆంక్షల సడలింపు తర్వాత కరోనా వైరస్ వేంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్ వ్యాప్తంగా లక్షా యాభై వేలకు [more]

Update: 2020-05-27 03:16 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. ఆంక్షల సడలింపు తర్వాత కరోనా వైరస్ వేంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్ వ్యాప్తంగా లక్షా యాభై వేలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. 24 గంటల్లో 5687 కరోనా పాజిటి్ కేసులు నమోదయ్యాయి. ఇలాగే వైరస్ కొనసాగితే జూన్, జులైై నెలల్లో పది రెట్లు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 32 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, గుజరాత్ లలోనూ వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. దీంతో ఐదో విడత లాక్ డౌన్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ భారత్ లో 1,50,796 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 4344 మంది మృతి చెందారు.

Tags:    

Similar News