ఏపీని భయపెడుతోందే? 303 కు చేరుకున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా ఈరోజు 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసుల సంఖ్య [more]

Update: 2020-04-06 13:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా ఈరోజు 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసుల సంఖ్య 303కు చేరుకుంది. ఇప్పటి వరకూ కర్నూలులో 18, నెల్లూరులో 8, పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు, కడప జిల్లాలో నాలుగు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మొత్తం 74 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 42 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన ప్రాంతాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించి చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకూ ఏపీలో ఆరుగురు కరోనా వ్యాధి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో ఎక్కువ మంది నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. ఒక్క కర్నూలు జిల్లా నుంచి 300 మందికి పైగా ఢిల్లీ వెళ్లి వచ్చారు.

Tags:    

Similar News