తెలంగాణాలో ఆగని కరోనా.. హైదరాబాద్ లోనే అత్యధికంగా

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుంది. ఒక్కరోజే 1,590 మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో 1,277 కరోనా కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఒక్కరోజులోనే [more]

Update: 2020-07-06 02:07 GMT

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుంది. ఒక్కరోజే 1,590 మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో 1,277 కరోనా కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఒక్కరోజులోనే ఏడుగురు మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 23,902కు పెరిగింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 295కి చేరుకుంది. కరోనా టెస్ట్ లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇందులో 30 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇప్పటి వకూ తెలంగాణాలో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 12,703గా ఉంది. యాక్టివ్ కేసులు 10,904 వరకూ ఉన్నాయి. రోజురోజుకూ తెలంగాణాలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News