ఉద్యోగం ఊడింది… పోయి పాకిస్థాన్ లో పనిచేసుకో

పుల్వామా ఉగ్రవాద దాడి ఘటనపై పాకిస్థాన్ తప్పేమీ లేదన్నట్లుగా ఆ దేశం పట్ల సానుభూతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు [more]

Update: 2019-02-16 09:35 GMT

పుల్వామా ఉగ్రవాద దాడి ఘటనపై పాకిస్థాన్ తప్పేమీ లేదన్నట్లుగా ఆ దేశం పట్ల సానుభూతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సోని సంస్థ షాక్ ఇచ్చింది. కపిల్ శర్మ షోలో జడ్జిగా ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో పురానా కు స్థానం కల్పించింది. పుల్వామా ఘటన అనంతరం సిద్ధూ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో సోని సంస్థ వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ పట్ల ప్రేమ ఒలకబోయడంలో సిద్ధూ ఎప్పుడూ ముందుంటారు. గతంలోనూ ఆయన పిలవగానే పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా, ఖలిస్థాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా సన్నిహితంగా మెలిగి ఓవర్ యాక్షన్ చేశారు.

Tags:    

Similar News