సోనియా గాంధీ అసంతృప్తి… కేంద్రం తీరుపై?

దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో కరోనా పరీక్షలు నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. దేశంలో టెస్ట్ ల కొరత ఉందన్నారు. [more]

Update: 2020-04-23 06:02 GMT

దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో కరోనా పరీక్షలు నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. దేశంలో టెస్ట్ ల కొరత ఉందన్నారు. అనేక రాష్ట్రాల్లో టెస్ట్ కిట్స్ లేక పరీక్షలు నిర్వహించలేక పోతున్నారని అభిప్రాయపడ్డారు. ఉన్న కిట్స్ కూడా నాసిరకం కావడతో పరీక్ష ఫలితాలు ఖచ్చితంగా రావడం లేదని సోనియా అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షల విషయాన్ని పట్టించుకోవడం లేదని సోనియా అన్నారు. అలాగే వలస కూలీల విషయంలోనూ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోయిందన్నారు సోనియాగాంధీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ తో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Tags:    

Similar News