మరోసారి సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు

పుల్వామాలో సీఐఎస్ఎఫ్ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిపై దేశమంతా పాకిస్థాన్ పై ప్రతీకారం కోరుతోంది. 43 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను దెబ్బకు దెబ్బ తీసి [more]

Update: 2019-02-15 10:01 GMT

పుల్వామాలో సీఐఎస్ఎఫ్ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిపై దేశమంతా పాకిస్థాన్ పై ప్రతీకారం కోరుతోంది. 43 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకోవాలని అంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. అయితే, కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పాకిస్థాన్ తో చర్చలు జరపాలని, చర్చలు జరిపితేనే ఇటువంటి ఘటనలు జరగవని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పటికే ఆయన పలు సందర్భాల్లో పాకిస్థాన్ పై తన ప్రేమను ఒలకబోసుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానం అందిందే ఆలస్యం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లారు. అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ ను ఆలింగనం చేసకొని ఓవర్ యాక్షన్ చేశారు. పాక్ కు చెందిన ఖలిస్థాన్ టెర్రరిస్టుతో ఫోటో దిగారు. ఇక, పుల్వామా ఘటనపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాత్రం.. పుల్వామా ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఓపిక పట్టింది చాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News