రాహుల్ గాంధీ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు

హిందూ యువతులపై ఇతర మతస్థులు చేయి వేస్తే నరికేయాలని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి తన నోటికి పని [more]

Update: 2019-01-31 06:51 GMT

హిందూ యువతులపై ఇతర మతస్థులు చేయి వేస్తే నరికేయాలని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో యన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ తన మతానికి సంబంధించి అబద్ధాలు చెబుతున్నాడని… ఒక ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లి కుమారుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. రాహుల్ ది హైబ్రిడ్ బ్రీడ్ అని ఎద్దేవా చేశారు. ఇటువంటివి ప్రపంచంలో ఏ ల్యాబ్ లోనూ జరగవని, కేవలం మన దేశంలో కాంగ్రెస్ అనే ప్రయోగశాలలో మాత్రమే జరుగుతుందన్నారు. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఓ ఆలయంలో పూజ చేస్తూ.. తనది దత్తాత్రేయ గోత్రమని, తాను కాశ్మీరి బ్రాహ్మణుడను అని రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News