టీడీపీ కీలక అధికారికి జగన్ ప్రభుత్వం?

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు.. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఠాకూర్ ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ [more]

Update: 2021-01-13 07:04 GMT

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు.. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఠాకూర్ ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఉన్నారు. ఈ ఏడాాది జూలై వరకు ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు.. ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి కృష్ణబాబుకి ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

టీడీపీ హయాంలో….

ఆర్పీ ఠాకూర్ టీడీపీ హయాంలో డీజీపీగా పనిచేశారు. వాస్తవానికి అప్పుడు గౌతమ్ సవాంగ్ డీజీపీగా పోస్టింగ్ వస్తుందని భావించారు.. కానీ అనూహ్యంగా ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ హయాంలో మాలకొండయ్య తర్వాత ఆర్పీ ఠాకూర్ 2018లో డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించారు. ఠాకూర్ 10 నెలలకుపైగా ఆ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
…….

Tags:    

Similar News