బ్రేకింగ్ : 1600 కోట్లు హుష్ కాకి

తమిళనాడులో శశికళకు చెందిన 1600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెంగళూరులోని పరప్పణ అగ్రహార [more]

Update: 2019-11-05 06:09 GMT

తమిళనాడులో శశికళకు చెందిన 1600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శశికళకు చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరులలో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత శశికళ ఈ అక్రమ ఆస్తులను బినామీల పేరుతో కూడబెట్టినట్లు ఐటీ శాఖ తమ సోదాల్లో కనుగొనింది. దీంతో పదహారు వందల కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. ఇది శశికళ కు కోలుకోలేని దెబ్బ.

Tags:    

Similar News