ఆ రికార్డు ఏపీ అసెంబ్లీదే..!

Update: 2018-11-24 11:46 GMT

గుజరాత్ లో నర్మదా నది తీరాన ఇటీవల ప్రారంభమైన సర్దార్ పటేల్ విగ్రహం ప్రచంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డులకు ఎక్కింది. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ఈ విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తు నిర్మించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రికార్డును బ్రేక్ చేయనుంది. అమరావతిలో కృష్ణా నది తీరాన నిర్మించనున్న అసెంబ్లీ సర్దార్ పటేల్ విగ్రహం కంటే ఎత్తు నిర్మించనున్నారు. నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్లలో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ డిజైన్ ను ఫైనల్ చేసింది. ఈ డిజైన్ ప్రకారం అసెంబ్లీ భవనం పైన భారీ ఎత్తులో టవర్ ఉంటుంది. టవర్ తో కలిపి ఈ భవనం ఎత్తు మొతకతం 250 మీటర్లు ఉండనుందట. అంటే పటేల్ విగ్రహం కంటే 68 మీటర్ల ఎత్తు ఏపీ అసెంబ్లీ భవనం ఉండనుంది.

Similar News